HomeTelugu Trending'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'గా అఖిల్‌!

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’గా అఖిల్‌!

4 2
టాలీవుడ్‌ యంగ్‌ హీరో అక్కినేని అఖిల్.. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తాజాగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ప్రేమకథా చిత్రం ఇది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి వుంది.

ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. రేపు సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు టైటిల్ ను విడుదల చేయనున్నారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనీ, దాదాపు ఇదే టైటిల్ ఖరారు చేయవచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుందని అంటున్నారు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో అఖిల్ వున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu