HomeTelugu Newsవెబ్‌ సిరీస్‌లో అక్కినేని హీరో!

వెబ్‌ సిరీస్‌లో అక్కినేని హీరో!

Akhil akkineni in web serie
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వెబ్‌ సిరీస్‌ల హవా నడుస్తోంది. అనుకున్న కథను వీలైనంత బడ్జెట్‌లో రూపొందించేందుకు వెబ్‌ సిరీస్‌లు సరైన వేదికగా భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. అంతే కాకుండా కాస్త ఘాటైన కంటెంట్‌ను సెన్సార్‌ ఇబ్బందులు లేకుండా విడుదల చేసేందుకు కూడా వెబ్‌ సరైన వేదికగా భావిస్తున్నారు. దాంతో చాలా మంది వెబ్ సిరీస్‌ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది హీరోయిన్లు వెబ్‌సిరీస్ లు మొదలు పెట్టగా.. ఇప్పుడు హీరోలు కూడా అదే బాటలో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు . ఇదిలా ఉంటే అక్కినేని యువ హీరో అఖిల్ సరైన సక్సెస్ కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరక్కేక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం.. అఖిల్ వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ క్రేజీ హిందీ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర కోసం అఖిల్‌ను సంప్రదించారట. ఈ సిరీస్‌లో రాక్ స్టార్ పాత్రను ఆఫర్ చేశారట. అయితే అఖిల్ దీనికి అంగీకరించాడా లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu