HomeTelugu Trendingఅనిల్‌ రావిపూడితో అఖిల్‌!

అనిల్‌ రావిపూడితో అఖిల్‌!

Akhil movie with Anil ravipఅక్కినేని అఖిల్.. ఇప్పటి వరకు హీరోగా మూడు సినిమా చేసిన ఒక్క హిట్ కూడా రాలేదు. ప్రస్తుతం అఖిల్‌ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా తర్వాత అఖిల్.. టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూకుడు మీదున్న దర్శకుడు అనిల్ రావిపూడితో తరువాత సినిమా చేసేందుకు ప్లాన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం హిట్ అవసరమైన అఖిల్.. అనిల్ రావిపూడితో పూర్తి హిల్లేరియస్ కామెడీ ఫిల్మ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమా అప్పట్లో నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’, ‘ప్రెసిడెంటు గారి పెళ్లాం’ తరహాలో ఉంటుందని చెబుతున్నారు.

ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా కనిపించిన అఖిల్.. ఇపుడు పూర్తిస్థాయి ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్ మూవీగా ఈ సినిమా సమాచారంతో రానున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డితో కూడా ఓ మూవీ చేయన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu