HomeTelugu Newsఫ్యాన్స్‌ అఖిల్‌ అక్కినేని పిలుపు...

ఫ్యాన్స్‌ అఖిల్‌ అక్కినేని పిలుపు…

12 4

అక్కినేని యంగ్‌ హీరో అఖిల్ తన అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికిగా ఒక మెసేజ్ చేసాడు. రేపు అఖిల్ పుట్టినరోజు ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‌ ఎవరు తన పుట్టినరోజు వేడుకలు చేయవద్దని రిక్వెస్ట్ చేసాడు. ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌ బారిన పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో బర్త్ డే సెలబ్రేషన్స్ సరి కాదన్నాడు ఈ హీరో. అభిమానులందరు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని కోరారు. అలాగే తన సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడం లేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే కదా. అందరు విధిగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరాడు. రేపు తన పుట్టినరోజు సందర్భంగా తన ఫ్యామిలీ ఫోటో ఒకటి పోస్ట్ చేస్తున్నాను. అలాగే నా కోసం మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోను పోస్ట్ చేయండని అభిమానులతో పాటు ప్రేక్షకులను కోరారు.

అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్‌కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో తెరకెక్కుతోంది.

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu