HomeTelugu Trending'సైరా' దర్శకుడితో అఖిల్‌ మూవీ

‘సైరా’ దర్శకుడితో అఖిల్‌ మూవీ

Akkineni akhil next movie w

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన చారిత్రత్మిక చిత్రం ‘సైరా’. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అయితే తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకు ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ఓ సినిమా ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా ఆయన తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడని అంటున్నారు.

కాగా ఇప్పటి వరుకు అఖిల్ హీరోగా నాలుగు సినిమాలు చేసినా ఒక్కటీ విజయాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం తన ఐదవ చిత్రాన్ని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ చేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దీనిపై అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో సురేందర్ రెడ్డి చెప్పిన కథ బాగుండడంతో ఈ ప్రాజక్టు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడికావచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu