HomeTelugu Trendingఅక్షయ్ కుమార్ ఓమైగాడ్-2 టీజర్

అక్షయ్ కుమార్ ఓమైగాడ్-2 టీజర్

Akshai OMG2 teaser
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హీరోగా సూపర్ కామెడీ డ్రామాగా రూపొందిన ‘ఓ మై గాడ్’ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఆ సినిమాలో అక్షయ్ శ్రీకృష్ణుడిగా కనిపించాడు. ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో దానికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘ఓ మై గాడ్ 2’ ను తెరకెక్కిస్తన్నారు. ఇందులో అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించనున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి షూటింగా పార్ట్ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్షయ్ కుమార్, అశ్విన్ వర్దే సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు, అమిత్ రాయ్ డైరెక్టర్. ‘ ఓ మై గాడ్’ లో పరేశ్ రావెల్ కీలక పాత్రలో కనిపించారు. సీక్వెల్‌లో పంకజ్ త్రిపాఠి ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆద్యంతం క్యూరియాసిటీని పెంచే ఈ టీజర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అక్షయ్ కుమార్ శివుడిగా ఓ రేంజ్‌లో ఉంది. ఈ సందర్భంగా టీజర్ వీడియోను షేర్ చేస్తూ అక్షయ్ కుమార్.. “విశ్వాసం ఉంచండి.. టీజర్ ఇప్పుడే విడుదలైంది, ఆగస్ట్ 11న థియేటర్లలో రానుంది” అంటూ క్యాప్షన్ లో రాసుకొచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu