HomeTelugu Trendingఅక్షయ్ కుమార్ లక్ష్మీబాంబ్ ట్రైలర్

అక్షయ్ కుమార్ లక్ష్మీబాంబ్ ట్రైలర్

Akshay Kumar Laxmi Bomb tra

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన కాంచన సినిమా సౌత్‌లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే మూవీని హిందీలో తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా లక్ష్మిబాంబ్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. ఈ సినిమాకు సంబంధించి గతంలోనే అక్షయ్‌ కుమార్‌ లేడీ గెటప్‌లో ఉన్న ఫొటోను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. వచ్చేనెల 9న ఓటీటీ ద్వారా విడుదల కాబోతుంది. అక్షయ్‌కు జోడీగా కియారా అద్వానీ నటించింది. ట్రైలర్‌కు సోషల్‌ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఇందులో అక్షయ్‌ హర్రర్‌ కామెడీ చేస్తూ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయని చెప్పొచ్చు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu