HomeTelugu Trendingపవన్‌ సినిమాలో నటించడానికి అభ్యంతరం లేదు కానీ..

పవన్‌ సినిమాలో నటించడానికి అభ్యంతరం లేదు కానీ..

8 7
టాలీవుడ్ హాస్యనటుడు అలీ, పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ మంచి స్నేహితున్న విషయం అందరికి తెలిసిందే. కానీ పవన్ రాజీకీయాల్లోకి వచ్చాక అలీ కి పవన్‌ కల్యాణ్‌కు మద్య దూరం పెరిగింది. అలీ అనూహ్య రీతిలో పవన్‌ స్థాపించిన జనసేన పార్టీలో కాకుండా వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆమధ్య అలీపై వ్యాఖ్యలు చేయడం ఆవ్యాఖ్యలకు అలీ కౌంటర్ ఇవ్వడం జరగడంతో అలీకి పవన్ కు మధ్య కొంచెం దూరం పెరిగింది. అయితే తాజాగా పవన్ కల్యాణ్‌ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే పవన్ సినిమాలో నటిస్తారా అని అలీని ఆ మధ్య అడిగితే సినిమాలు వేరు రాజకీయాలు వేరు అంటూ సమాధానం ఇచ్చారు. ఇటీవల ఒక ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోను ఇదే విషయాన్నీ చెప్తూ తాను పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి సిద్దంగానే ఉన్నాను కానీ.. మూవీయూనిట్ ఎవ్వరు ఇంతవరకు తనను సంప్రదించలేదని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu