HomeTelugu Trending'సభకు నమస్కారం' అంటున్న అల్లరి నరేశ్‌

‘సభకు నమస్కారం’ అంటున్న అల్లరి నరేశ్‌

Allari naresh 58th movie ti

టాలీవుడ్‌ నటుడు అల్లరి నరేశ్ నేడు(జూన్‌ 30) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన కొత్త సినిమా అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన హీరోగా నటిస్తున్న58వ చిత్రం ఇది. ఈ సినిమాకి ‘సభకు నమస్కారం’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.

ఈమేరకు టైటిల్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. టైటిల్‌కు తగ్గట్లుగానే పోస్టర్‌లో కూడా సభకు నమస్కారం చేస్తూ కనిపించారు. ఇక్కడ నరేష్ బ్యాక్ పాకెట్ లో డబ్బులు, మరో పాకెట్ లో మందు సీసా ఉండటం గమనించవచ్చు. దీనిని బట్టి చూస్తే ఇదొక పొలిటికల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈస్ట్‌ కోస్ట్‌ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మల్లంపాటి సతీష్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. అబ్బూరి రవి సంభాషణలు సమకూరుస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu