HomeTelugu Trendingఉత్కంఠగా అల్లరి నరేష్‌ 'నాంది' టీజర్‌

ఉత్కంఠగా అల్లరి నరేష్‌ ‘నాంది’ టీజర్‌

1a 3

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నాంది’. విజయ్‌ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సామాజిక అంశాల మేళవింపుతో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ రోజు (మంగళవారం) నరేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘నాంది’ టీజర్‌ విడుదలైంది. హీరో విజయ్‌ దేవరకొండ ఈ మూవీ టీజర్‌ను అభిమానులతో పంచుకున్నారు.

”ఈ ప్రపంచాన్ని టీజర్‌ రూపంలో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ‘నాంది’ చిత్ర బృందానికి నా తరఫున హృదయపూర్వక అభినందనలు. నరేష్‌ అన్న ఇందులో మీరు అద్భుతంగా ఉన్నారు” అని టీజర్‌ను పంచుకున్న సందర్భంగా విజయ్‌దేవర కొండ పేర్కొన్నారు. ఇందులో అల్లరి నరేష్ పోలీస్ స్టేషన్‌లో నగ్నంగా కింద కూర్చుని ఉన్నాడు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ లాయర్‌ ఆద్య పాత్రలో నటిస్తుండగా, రాధా ప్రకాశ్‌గా ప్రియదర్శి, కిషోర్‌ అనే పోలీస్‌ పాత్రలో హరిశ్‌ ఉత్తమన్‌, సంతోష్‌గా నటుడు ప్రవీణ్‌ కనిపించనున్నారు. లాక్‌డౌన్‌కి ముందే ఎనభై శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. శ్రీచరణ్‌ పాకాల ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu