HomeTelugu Trendingపోలీస్ స్టేషన్‌లో నగ్నంగా అల్లరి నరేష్‌..

పోలీస్ స్టేషన్‌లో నగ్నంగా అల్లరి నరేష్‌..

6 16
కామెడీ హీరో అల్లరి నరేష్ ఇప్పటి వరకు 56 సినిమాలు చేశారు. ఈ 56 సినిమాల్లో చాలా వరకు ఎంటర్టైనర్ సినిమాలే కావడం విశేషం. కొన్ని సినిమాలు మాత్రం ప్రయోగాత్మక సినిమాలు చేసినా, పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రయోగాత్మకంగా నటించిన అల్లరి సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో వరసగా సినిమాలు చేశారు.

56 సినిమాలు సినిమాల్లో చాలా వరకువిజయం సొంతం చేసుకున్నాయి. అయితే, రొటీన్ గా కామెడీ సినిమాలు చేయడంతో, హిట్ కాలేకపోయాయి. కాగా, ఇప్పుడు అల్లరి నరేష్ నాంది పేరుతో మరో సంచలన సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాను కనకమేడల దర్శకత్వం వహిస్తుండగా దర్శకుడు వేగేశ్న సతీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ నగ్నంగా నటించిన ఫోటోతో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఒళ్ళంతా వాతలతో శరీరం కమిలిపోయి ఉంటుంది. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఈ నాంది సినిమాతో అయినా నరేష్ హిట్ కు నాంది పలుకుతారేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu