HomeTelugu Trendingదసరాకి అల్లు అర్జున్‌ ట్రీట్‌..!

దసరాకి అల్లు అర్జున్‌ ట్రీట్‌..!

11 4

స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్…త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్నది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ను మొదట త్రివిక్రమ్ పుట్టినరోజున రిలీజ్ చేయాలని అనుకున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే, టీజర్ త్రివిక్రమ్ పుట్టినరోజున కాకుండా.. దసరా రోజున విడుదల చేయాలని అనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. టీజర్ రిలీజ్ చేయడానికి దసరా కంటే మంచి సమయం లేదని, ఆరోజున రిలీజ్ చేస్తే అన్నివిధాలుగా బాగుంటుందని అనుకుంటున్నారట. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో టబు కీలక పాత్ర పోషిస్తోంది. గీతా ఆర్ట్స్ – హారిక అండ్ హాసిని వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu