HomeTelugu Trendingవైరల్‌ అవుతున్న అల్లు అర్జున్‌ సాంగ్‌!

వైరల్‌ అవుతున్న అల్లు అర్జున్‌ సాంగ్‌!

5 26
టాలీవుడ్‌ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో సినిమా ‘అల వైకుంఠపురంలో’. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాకు సంబంధించిన చిన్న న్యూస్ బయటకు వచ్చినా ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నది. కాగా, నిన్నటి రోజున ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ సామజవరగమనా లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అద్భుతమైన పదాలతో.. ప్రాసలతో ఆకట్టుకుంది. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన ఈ పాట ప్రతి నోట పలికించే విధంగా ఉండటంతో జనహృదయాలల్లోకి అవలీలగా వెళ్ళిపోయింది.

మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే విధంగా ఉండటంతో యూట్యూబ్ లో ఈ సాంగ్ ను తెగ వినేస్తున్నారు. లైకులు కొట్టేస్తున్నారు. దీంతో ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యింది. 24 గంటల్లోనే 6 మిలియన్ వ్యూస్, 3,12,000లైక్స్ ను సొంతం చేసుకుంది. ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోకు ఈ స్థాయిలో వ్యూస్ రావడం ఒక రికార్డ్ అని చెప్పాలి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu