HomeTelugu Trending'అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌' కొత్త సినిమా ప్రకటన

‘అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌’ కొత్త సినిమా ప్రకటన

allu arjun and trivikram ne

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్… త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలసిందే. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు వీరి కాంబోలో రానున్న నాల్గో సినిమా ఇది. ఈ రోజు గురు పూర్ణిమ శుభ సందర్భంగా ఈ సినిమా ప్రకటన వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేష‌న్స్‌, గీతా ఆర్ట్స్ ప‌తాకాల‌పై రాధాకృష్ణ‌, అల్లు అర‌వింద్ నిర్మించ‌బోతున్నారు. హీరోగా బన్నీకి ఇది 22వ సినిమా. దీనికి త‌మ‌న్ సంగీతాన్ని అందించ‌బోతున్నారు.

త్రివిక్రమ్ ప్ర‌స్తుతం మ‌హేష్‌ బాబుతో గుంటూరు కారం సినిమా రూపొందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రిలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మరోవైపు పుష్ప-2 సినిమాతో బన్నీ బిజీగా ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్త‌యిన త‌ర్వాతనే అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ సినిమా పట్టాలు ఎక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది. దీంతో అల్లు ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనౌన్స్ మెంట్ వీడియో సోషల్ మీడియాలో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu