HomeTelugu Big Storiesపొలిటికల్‌ లీడర్‌గా బన్నీ!

పొలిటికల్‌ లీడర్‌గా బన్నీ!

Allu Arjun as a political lస్టైలీష్ స్టార్‌ అల్లుఅర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బీజీగా ఉన్నారు. ఈ సినిమాకి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక బన్నీకొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్లో 21వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని అల్లు అరవింద్ సమర్పణలో యువసుధ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి అల్లు అర్జున్ స్నేహితులు శాండీ – స్వాతి – నట్టి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. సామాజిక అంశాలతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని 2022న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓన్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

అల్లు అర్జున్ ఈ సినిమాలో పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడట. అయితే ఇప్పుడు కొరటాల సినిమాలో మొదటి సారిగా నేరుగా పాలిటిక్స్ చేసే నాయకుడిగా బన్నీ నటిస్తున్నాడట. ఈ సినిమా మొత్తం స్టూడెంట్ పాలిటిక్స్ – పేదరికం – నిరక్షరాస్యత.. ఇలాంటి అంశాలు చుట్టూనే తిరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఆచార్య’ సినిమా పూర్తైన తర్వాత కొరటాల ఈ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టానున్నట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu