HomeTelugu Big Storiesఅల్లు అర్జున్‌ కూతురు అర్హ టాలీవుడ్‌ ఎంట్రీ!

అల్లు అర్జున్‌ కూతురు అర్హ టాలీవుడ్‌ ఎంట్రీ!

Allu arjun daughter arha to

టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వారసురాలు అల్లు అర్హ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్‌ మీడియా అర్హకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. అర్హ సంబంధించిన వీడియోలను, ఫొటోలను ఎప్పటికప్పుడు బన్ని తన సోషల్ మీడియాల ద్వారా షేర్ చేయగా అవన్నీ అభిమానుల్లోకి వైరల్ గా దూసుకెళ్లాయి. ఇటీవల అంజలి అంజలి వీడియో పాటను అర్హాతో పునః సృష్టించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయ్యింది.

తాజాగా టాలీవుడ్‌లో అర్హ బాలనటిగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న చిత్రంలో బాలనటిగా ఆరంగేట్రం చేయనుందని టాక్‌. నిజానికి బన్ని కెరీర్‌లో ‘ఆర్య’ లాంటి బ్లాక్ బస్టర్ ని అందించిన దిల్ రాజుతోనే ఇప్పుడు అల్లు అర్హతో సినిమాని ప్లాన్ చేస్తున్నారట. బాలల చిత్రాన్ని తెరకెక్కించేందుకు దిల్‌రాజ్‌ ప్లాన్ చేస్తున్నరట.. ఈ చిత్రంలో అర్హను ప్రధాన పాత్రకు ఎంపిక చేసుకున్నారు. ఇదే చిత్రంలో ఇండస్ట్రీకి చెందిన పలువురి వారసులు తెరకు పరిచయమయ్యేందుకు అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Allu arjun daughter

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ కాస్టింగ్ సెలక్షన్ సాగుతోంది. అల్లు అర్హ కోసం బన్నితో ఇప్పటికే చర్చలు సాగిస్తున్నారు. ఈ సినిమా ద్వారా సురేష్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారట. దీనిపై అధికారికి సమాచారం విడుదలకావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu