HomeTelugu Newsబన్నీ కొత్తకారు 'బీస్ట్‌'

బన్నీ కొత్తకారు ‘బీస్ట్‌’

14 7స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గత కొన్నాళ్ళగా సైలెంట్ గా ఉన్న.. ఒక్క సారిగా స్పీడ్ పెంచాడు. ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న ఆయన ఇప్పుడు వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. బన్నీ తాజాగా నటిస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ముచ్చటగా మూడో సారి ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇక తాజాగా ఆయన కారు కొనుక్కున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. కొత్త రేంజ్ రోవర్ కారు కొన్న బన్నీ ‘మా ఇంట్లోకి కొత్త కారు వచ్చింది. దానికి నేను ‘బీస్ట్’ అని పేరు పెట్టా. నేను ఏ వస్తువు కొన్నా దానిలో చూసేది కృతజ్ఞతనే’ అని బన్నీ ట్వీట్ చేశాడు. కారుల ప్రియుడు అయిన బన్నీ, ఈమధ్యనే ఒక క్యారవాన్ ని కొనుగోలు చేసి, దానికి ఫాల్కన్ అనే పేరు కూడా పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సరికొత్త రేంజ్ రోవర్ ఆయన గ్యారేజ్ లోకి ఈ బీస్ట్ ఎంట్రీ ఇచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu