HomeTelugu Trending'అసురన్‌' నిర్మాతలతో అల్లు అర్జున్‌ మూవీ

‘అసురన్‌’ నిర్మాతలతో అల్లు అర్జున్‌ మూవీ

Allu arjun next movie with

టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా షూటింగు త్వరలోనే పూర్తికానుంది. దాదాపు దసరా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ తదుపరి సినిమాపై ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఆయన ‘ఐకాన్’ సినిమా చేయనున్నాడని అంటున్నారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో ముందుగా మురుగదాస్ సినిమా చేయాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ ఉన్నాడనే టాక్.

అయితే తమిళంలో నిర్మాతగా కలైపులి థాను బ్యానర్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన బ్యానర్లో స్టార్ హీరోల సినిమాలు వరుసగా రూపొందుతూ ఉంటాయి. తుపాకి’ ‘పోలీసోడు’ ‘కబాలి’ ‘అసురన్’ ‘కర్ణన్’ వంటి చిత్రాలను నిర్మించారు. విజయ్ వంటి స్టార్ హీరోలతో ఆయన నిర్మించిన భారీ సినిమాలు తెలుగులోను ప్రేక్షకుల ఆదరణ పొందాయి. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “అల్లు అర్జున్ తో ఒక ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఆ చర్చలు కార్యరూపాన్ని దాల్చుతాయని భావిస్తున్నాను” అన్నారు. దాంతో ఇది మురుగదాస్ ప్రాజెక్టు కోసమేనని అనుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu