HomeTelugu Trendingపూజా నా ఒక్కడికే స్పెషల్ అనుకున్నా: బన్నీ

పూజా నా ఒక్కడికే స్పెషల్ అనుకున్నా: బన్నీ

Allu Arjun praises Puja Heg

అఖిల్‌ అక్కినేని తాజా చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్”. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించినందుకు హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సఁదర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ పూజా హెగ్డే ప్రతి సినిమాలో తనదైన శైలిలో వైవిధ్యంగా నటిస్తోందని ప్రశంసలు కురిపించారు.

Allu Arjun praises 1

అంతేకాదు ఆమె ఎవరితో నటించినా ఆ హీరో హిట్ అందుకుంటాడని కితాబునిచ్చారు. ఈ సినిమాత అఖిల్ సక్సెస్‌ను అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. అఖిల్‌ అంటే నాకు చాలా ఇష్టం. అఖిల్‌ను నేను తమ్ముడిలా భావిస్తాను. పూజా నాకు ఒక్కడికే స్పెషల్ అనుకున్నా.. కానీ కాదు, ఆమె అందరి హీరోలకి స్పెషలే అని అన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్‌ డైరెక్షన్‌లో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మొదటి భాగం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu