HomeTelugu Big Stories'లవర్స్‌ డే' ఆడియో లాంచ్‌లో కన్నుగీటిన అల్లు అర్జున్.. వైరల్‌

‘లవర్స్‌ డే’ ఆడియో లాంచ్‌లో కన్నుగీటిన అల్లు అర్జున్.. వైరల్‌

3 25స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్ తనకు ఫిబ్రవరి 14 (ప్రేమికుల రోజు) అంటే చాలా ఇష్టమని అంటున్నారు‌. మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్‌గా నటించిన ‘ఒరు అడార్ లవ్‌’ చిత్రం తెలుగులో ‘లవర్స్‌ డే’ టైటిల్‌తో విడుదల కాబోతోంది. ఈ చిత్ర ఆడియో విడుదల‌ వేడుకను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు బన్నీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ మధ్యకాలంలో ప్రియా ప్రకాశ్‌ కన్నుకొట్టిన వీడియో చాలా వైరల్‌ అయింది. దేశవ్యాప్తంగా మన దక్షిణాది చిత్ర పరిశ్రమకు సంబంధించి వైరల్‌ అయిన విషయాల్లో ‘కొలవెరి డీ’ పాట, ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అన్న ప్రశ్న ఉన్నాయి. ఆ తర్వాత అంతటి స్థాయిలో వైరల్‌ అయిన వీడియో మాత్రం ప్రియా ప్రకాశ్‌దే. ఈ వేడుకకు వచ్చాను కాబట్టి మనసులో ఉన్నమాట చెప్పేస్తాను. నాకు సౌతిండియా అంటే పిచ్చి. అది తెలుగు, తమిళం, మలయాళం ఏదైనా కావచ్చు. నా వృత్తిని సౌతిండియన్‌ యాక్టర్‌ అని చెప్పుకొంటాను. అందులో నాకు ఏ మొహమాటం లేదు. ఎందుకంటే నేను పుట్టింది చెన్నైలో.. పెరిగింది హైదరాబాద్‌లో.. నన్ను ఆదరిస్తోంది మలయాళం ఫ్యాన్స్‌. నేను ఈ వేడుకకు రావడానికి రెండు కారణాలున్నాయి’

‘మొదటి కారణమేంటంటే.. నేను చేసిన ప్రతీ సినిమాను మలయాళం అభిమానులను ఎంతగానో ఆదరిస్తుంటారు. తెలుగు వారి భాష కాకపోయినా సొంత సినిమాకంటే ఎక్కువగా నా సినిమాలను ఆదరిస్తున్నారు. అలాంటిది అక్కడి సినిమా తెలుగులో విడుదల అవుతున్నప్పుడు నా వంతు నేను ప్రోత్సహించాలి కదా అని వచ్చాను. అక్కడి నుంచి ఇలాంటి మరెన్నో సినిమాలు రావాలి. రెండో కారణం ఏంటంటే.. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాను కొనుకున్న వారిలో వినోద్‌ ఒకరు. ఆయన నాకు అభిమాని. కానీ సినిమా ఫ్లాపైంది. ఆ తర్వాత కొన్ని గొడవలు కూడా జరిగాయి. అప్పుడు నాకో విషయం తెలిసింది. ‘నా పేరు సూర్య..’ సినిమా విడుదల కావడానికి ముందు వినోద్‌ ఎలా ఉండేవారో ఇప్పుడు కూడా అంతే అభిమానంతో ఉన్నారని. ఈ విషయం తెలిశాక వినోద్‌కు నా వంతు ఏదన్నా చేయాలనిపించింది. అందుకే ఆయన నన్ను ఆడియో లాంచ్‌కు పిలవగానే కాదనలేకపోయాను. ‘లవర్స్‌ డే’ టైటిల్‌తో ‘ఒరు అడార్ లవ్’ తెలుగులో ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. అది నాకు చాలా ఇష్టమైన రోజు. ఇప్పటికీ ఫిబ్రవరి 14ని నా బర్త్‌డేలాగే గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటాను. ఈసారి నా భార్యకు ఎలా సర్‌ప్రైజ్‌ ఇవ్వాలా? అని ఆలోచిస్తుంటాను’ అని వెల్లడించారు.

కన్నుగీటి దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నారు ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఇప్పుడు అదే కన్నుగీటే సన్నివేశాన్ని బన్నీ అనుకరించారు. ఆడియో లాంచ్‌ వేడుక పూర్తయ్యే సమయంలో బన్నీ స్టేజ్‌పై కన్నుగీటి గన్‌షాట్‌ పేల్చిన సన్నివేశాన్ని అనుకరించి చూపించారు. బన్నీ కన్నుకొడుతున్నప్పుడు తీసిన వీడియోను ఓ అభిమాని ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu