HomeTelugu Big Storiesసంక్రాంతి వేడుకల్లో స్నేహారెడ్డితో బన్నీ 'సామజవరగమన'..

సంక్రాంతి వేడుకల్లో స్నేహారెడ్డితో బన్నీ ‘సామజవరగమన’..

2a
టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో..’ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా కొణిదెల, అల్లు కుటుంబ సభ్యులంతా కలిసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో భాగంగా బుధవారం రాత్రి ఆర్కెస్ట్రా నిర్వహించారు. ఓ గాయకుడు ‘సామజవరగమన..’, ‘రాములో రాములో..’ తదితర పాటల్ని ఆలపించారు. ఈ సమయంలో బన్నీ గాయకుడితోపాటు గొంతుకలిపారు. కుర్చీలో కూర్చొని ‘సామజవరగమన..’ అంటూ పాడారు. పక్కనే ఉన్న స్నేహారెడ్డి బన్నీని పట్టుకుని తెగ సిగ్గుపడుతూ కనిపించారు. ఈ చక్కటి వీడియోను అల్లు శిరీష్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ఇది నా సంక్రాంతిని ప్రత్యేకం చేసింది. ఈ సీజన్‌లో నాకు ఎంతో నచ్చిన ‘సామజవరగమన..’ పాట.. నాకిష్టమైన ఇద్దరు వ్యక్తులు’ అని కామెంట్‌ చేశారు.

2 13

అంతేకాదు ఇదే కార్యక్రమంలో బన్నీ.. నిహారికతో కలిసి ‘రాములో రాములో..’ పాటకు స్పెప్పులేశారు. ఈ వీడియోను అల్లు శిరీష్‌ చేశారు. తన మామయ్య చిరంజీవి, భార్య శ్రీజతో కలిసి తీసుకున్న సెల్ఫీలను కూడా కళ్యాణ్‌ దేవ్‌ షేర్‌ చేశారు. పండగ సంబరాలు అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. శ్రీజ చిన్న పాపను చిరు ఎత్తుకుని కనిపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu