HomeTelugu Newsరఫ్‌ లుక్‌లో అల్లు అర్జున్‌.. వాకింగ్‌ వీడియో వైరల్‌

రఫ్‌ లుక్‌లో అల్లు అర్జున్‌.. వాకింగ్‌ వీడియో వైరల్‌

9 1స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ..మాసిన గడ్డంతో రఫ్‌ లుక్‌లో కనపించాడు. తాజాగా ఆయన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. లాక్‌డౌన్‌ నేపధ్యంలో షూటింగులు కూడా ఆగిపోవడంతో సినీనటులు అందురు ఇంటికు పరిమితం అయ్యారు.

ఈ నేపథ్యంలో బన్నీ తన ఇంటి నుంచి బయటకు వచ్చి వాకింగ్ చేస్తున్నాడు. రెండు నెలల క్రితం ఆయన సూపర్ మార్కెట్‌కు వెళ్లి నిత్యవసరలు కొనుగోలు చేశాడు. అప్పట్లోనే ఆయన లుక్ వైరల్ అయింది. తాజాగా రోడ్డుపై ఆయన కనపడగా స్థానికుడు ఒకరు ఫొటో తీశారు. బన్నీ వెనుక బౌన్సర్లు కూడా ఉన్నారు. బన్నీని ఫొటో తీయొద్దని చెప్పారు. అల వైకుంఠపురంలో సినిమాతో భారీ హిట్‌ కొట్టిన బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమాలో లారీ డ్రైవర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu