మహేష్ బాటలో అల్లు అర్జున్!

టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వ్యాపారరంగంలోకి దిగుతున్నారు. ఇటీవలే మహేష్ బాబు మల్టీప్లెక్స్ రంగంలోకి దిగాడు. కొండాపూర్ లో ఏఏంబి సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్స్‌ను నిర్మించారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైన ఈ థియేటర్లు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలా ఉంటె, మహేష్ బాబు బాటలో ఇప్పుడు అల్లు అర్జున్ కూడా నడవబోతున్నట్టు తెలుస్తున్నది. మహేష్ బాబు నిర్మించిన విధంగానే అల్లు అర్జున్ కూడా థియేటర్లు నిర్మించే ఆలోచనలో ఉన్నాడట. థియేటర్స్ కోసం ఇప్పటికే స్థలం కూడా చూశాడని, త్వరలోనే అక్కడ మల్టీప్లెక్స్ థియేటర్స్ ను నిర్మిస్తారని వార్తలు వస్తున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates