HomeTelugu Trendingఅల్లు అర్జున్‌ తో లైకా ప్రొడక్షన్స్‌ మూవీ!

అల్లు అర్జున్‌ తో లైకా ప్రొడక్షన్స్‌ మూవీ!

allu arjun
ప్రముఖ నిర్మాణ సంస్థగా లైకా ప్రొడక్షన్స్ కి మంచి పేరు ఉంది. లైకా బ్యానర్లో సినిమా అంటే ఎంత భారీతనం ఉంటుందనేది అందరికీ తెలిసిందే. ఆమధ్య ‘రోబో 2.0’ ను ప్రేక్షకులముందుకు తీసుకు వచ్చింది .. ప్రస్తుతం కమల్ – శంకర్ కాంబినేషన్లో ‘ఇండియన్ 2’ సినిమా నిర్మిస్తుంది. భారీ ప్రాజెక్టులను మాత్రమే చేపట్టే ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ సినిమా తమిళ వెర్షన్ ను విడుదల చేసింది లైకా ప్రొడక్షన్స్‌.

ఇటు తమిళ .. మలయాళ భాషల్లోను .. అటు హిందీలోను ‘పుష్ప’ భారీ వసూళ్లను రాబట్టింది. అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ .. మార్కెట్ ఉందని గ్రహించిన లైకా , ఆయనతో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్లుగా కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ ప్రాజెక్టు ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu