HomeTelugu Trendingఅల్లు అర్జున్‌కి మూడు మిలియన్ల‌ ఆశీర్వాదాలు!

అల్లు అర్జున్‌కి మూడు మిలియన్ల‌ ఆశీర్వాదాలు!

3 21స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్ ట్విటర్‌ ఫాలోవర్ల సంఖ్య మూడు మిలియన్‌ మార్క్‌కు చేరింది. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘ఇది నా బలం కాదు.. మీ ఆశీర్వాదం’ అని అంటున్నారు ‌. ‘ట్విటర్‌లో మూడు మిలియన్ల‌ ఫాలోవర్లు. మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఇది నా బలం కాదు.. మీ ఆశీర్వాదం’ అని పేర్కొన్నారు.

ప్రస్తుతం బన్నీ.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. బన్నీ 19వ సినిమాగా ఇది రూపుదిద్దుకోబోతోంది. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ వంటి హిట్‌ల తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయని నిర్మాతలు తెలిపారు. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu