HomeTelugu Big Storiesబిగ్‌ అప్డేట్‌.. ప్రభాస్‌ సినిమాలో అమితాబ్

బిగ్‌ అప్డేట్‌.. ప్రభాస్‌ సినిమాలో అమితాబ్

Amitabh Joins in

టాలీవుడ్‌ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే హీరోయిన్ గా నటిస్తుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ మూవీ కోసం లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా వర్క్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. తాజాగా ఈ చిత్రం నుండి మరో బిగ్ అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. ఇండియన్ లెజెండరీ నటులు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు.

సైన్స్ ఫిక్షనల్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అమితాబ్ ది ఫుల్ లెన్త్ రోల్ అని మేకర్స్ ప్రకటించారు. ”బచ్చన్ సర్ మా చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని. ఈ చిత్రంలో ఆయనది పూర్తి నిడివి గల పాత్ర. లెజెండ్ అమితాబ్ ఈ పాత్రకు న్యాయం చేస్తాడని మేము నమ్ముతున్నాము” అని దర్శకుడు నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. పలు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. స్వప్నదత్ – ప్రియాంకా దత్ కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించనున్నారు. కాగా ఈ చిత్రం 2022లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu