బాలయ్యతో బోయపాటి మల్టీస్టారర్ ప్లాన్!

సింహా, లెజెండ్ వంటి చిత్రాల్లో బోయపాటి.. బాలయ్యను చూపించిన తీరుని మెచ్చుకోకుండా ఉండలేము. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు మరో సినిమా రాబోతుందని సమాచారం. ఇప్పుడు అభిమానుల్లో ఈ కాంబోపై ఆసక్తి మరింత పెరిగిపోతుంది. వచ్చే ఏడాది జూన్ నుండి ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈసారి వయిలన్స్ కాస్త తగ్గించి ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెద్ద పీట వేశాడని అంటున్నారు. మరో ఆసక్తికర విషయమేమిటంటే ఈ సినిమాలో బాలయ్యతో పాటు మరో అగ్రహీరో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఆ హీరో ఎవరనే విషయం ఇంకా తేలలేదు. 

సినిమాను పట్టాలెక్కించడానికి మరికొంత సమయం ఉండడంతో బోయపాటి ఇంకా సెకండ్ హీరోను ఫైనల్ చేయలేదని తెలుస్తోంది.