HomeTelugu Trendingఆనంద్ దేవరకొండ 'గం.. గం.. గణేశా' ఫస్ట్‌లుక్‌ విడుదల

ఆనంద్ దేవరకొండ ‘గం.. గం.. గణేశా’ ఫస్ట్‌లుక్‌ విడుదల

Anand devarakonda gam gam g

యంగ్‌ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘గం.. గం.. గణేశా’. మంగళవారం ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ‘గం.. గం.. గణేశా’ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆనంద్ టైటిల్ పేరు గణేష్ అని పోస్టర్ ద్వారా తెలుస్తోంది. మన గణేష్ గాడి స్వాగే సెపరేటు అంటూ రిలీజ్ చేసిన ఫొటో స్కెచ్ లో పగిలిన కళ్లద్దాలు, తలకు బ్యాండేజ్ చూస్తుంటే గణేష్ యాక్షన్ మోడ్ లో ఉన్నట్లు అర్థమవుతోంది. అంతే కాకుండా నోట్లో సిగరెట్ ద్వారా క్యారెక్టర్ కు ఉన్న స్వాగ్ ను సిగరెట్ చివర్లో లవ్ సింబల్ చూస్తుంటే హీరో లవ్ ను తెలియజేస్తుంది. ఓవరాల్ గా ఈ పోస్టర్ సినిమాలో హీరో ఆనంద్ క్యారెక్టర్ ను తెలియజేస్తుంది.

హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ ఇప్పటిదాకా చేయని యాక్షన్ జానర్ ను ఈ చిత్రంతో టచ్ చేయబోతున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

18 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న మహేష్‌ హీరోయిన్‌!

Recent Articles English

Gallery

Recent Articles Telugu