HomeTelugu TrendingCanes Film Festival: రికార్డు సృష్టించిన భారతీయ నటి.. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్

Canes Film Festival: రికార్డు సృష్టించిన భారతీయ నటి.. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్

Canes Film Festival

Canes Film Festival: 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా సాగుతోంది. ఫ్రాన్స్ లో మే 14న ప్రారంభమైన ఈ సినిమా వేడుక మే 25 వరకు జరగనుంది.ఈ ఫెస్టివల్ లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన సినిమాలను ఇక్కడ ప్రదర్శిస్తారు.అయితే ఈ సారి ఇండియాకు చెందిన 7 సినిమాలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించేందుకు ఎంపిక అయ్యాయి.

ఇందులో భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా చరిత్ర సృష్టించారు. శుక్రవారం రాత్రి జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘అన్‌ సర్టెయిన్‌ రిగార్డ్‌’ విభాగంలో ఉత్తమ నటి గా అవార్డు అందుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవంలో అవార్డు గెలిచిన తొలి భారతీయురాలిగా అరుదైన ఘనత సాధించారు.

బల్గేరియన్‌ దర్శకుడు కాన్‌స్టాంటిన్‌ బొజనోవ్‌ తెరకెక్కించిన ‘ది షేమ్‌లెస్‌’ అనే సినిమాకి గానూ ఆమె ఈ అవార్డు అందుకున్నారు. ఇందులో ‘రేణుక’ అనే సెక్స్‌ వర్కర్‌ పాత్ర పోషించారు. ఢిల్లీలోని ఓ బ్రోతల్‌ హౌస్‌లో పోలీసును చంపి రేణుక పారిపోతుంది. మరో రాష్ట్రంలో సెక్స్‌ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం పొందుతుంది.

అక్కడ 17ఏళ్ల దేవికతో ఆమె ప్రేమలో పడుతుంది. అడ్డంకులను అధిగమించి వీరిద్దరూ తమ జీవితాలను ఎలా కొనసాగించారన్నదే ఈ సినిమా కథా నేపథ్యం. ఔరోషిఖా డే, ఒమారా, అనసూయ సేన్గుప్తా మరియు మితా వశిష్ట్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమాను భారత్‌, నేపాల్‌లో నెలన్నర రోజుల పాటు చిత్రీకరించారు. తాజాగా జరుగుతున్న కేన్స్‌ ఉత్సవానికి ఈ చిత్రం ఎంపికయింది. ఈ వేడుకల్లో దీన్ని ప్రదర్శించగా.. వీక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాకు చెందిన అనసూయ కొన్నేళ్ల నుంచి సినీ రంగంలో ఉన్నారు. ముంబయిలో ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వ్యవహరించేవారు.

దర్శకుడు బొజనోవ్‌ ఆమెకు ఫేస్‌బుక్‌ స్నేహితులు. ఒకసారి ఆడిషన్‌ టేప్‌ పంపమని అనసూయకు చెప్పారు. అది నచ్చడంతో ‘ది షేమ్‌లెస్‌’ మూవీలో అవకాశమిచ్చారు. అలా నటిగా మూవీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. అనసూయ తొలి ప్రయత్నంలోనే కేన్స్‌లో అవార్డు అందుకోవడం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu