రష్మికి పోలీసుల కౌన్సిలింగ్..?

అప్పటివరకు బుల్లితెరపై చిన్న చిన్న షోలు చేసినప్పటికీ జబర్దస్త్ కామెడీ షోతో ఓ వెలుగువెలుగుతోంది రష్మీ. మొదట్లో కొన్ని సినిమాల్లో నటించినా.. రష్మికి తగిన గుర్తింపు లభించలేదు. అయితే ఇటీవల ఆమె హీరోయిన్ గా నటించిన ‘గుంటూర్ టాకీస్’ చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ తో యూత్ లో క్రేజ్ ను దక్కించుకుంది. హాట్ హాట్ అందాలతో అన్ లిమిటెడ్ ఎక్స్ పోజింగ్ చేసింది.

ఇదే జోరుతో మరో రెండు, మూడు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇది ఇలా ఉండగా ఈ హాట్ యాంకర్ కు సంబంధించి ఓ వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. రష్మి తప్పతాగి రోడ్ మీద పెద్ద గొడవ చేసిందట. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రష్మిని అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారట.

ఈ విషయం తెలిసి రష్మిని తన సన్నిహితులు ప్రశ్నించగా అబ్బే అలాంటిదేమీ లేదు.. అవన్నీ రూమర్స్ మాత్రమే..
అయినా నేను తాగడం ఏంటని ఎదురు ప్రశ్నిస్తుందట. ఇలాంటి విషయాలు పట్టించుకొని నా సమయం వృధా చేసుకోలేనని చెబుతోందట ఈ బ్యూటీ.