చైతు కోసం ఆ రెండు!

వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. నాగార్జున కెరీర్ లో నిన్నే పెళ్లాడతా సినిమా ఎలా నిలిచిపోయిందో.. అలానే చైతుకు కూడా ఈ సినిమా ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాగా మిగిలిపోతుందని చెబుతున్నారు. ఈ సినిమా అంతటి సక్సెస్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

అయితే తాజాగా ఈ సినిమా కోసం రెండు భారీ సెట్స్ వేసినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క సెట్ ఖరీదు అరవై లక్షలకు మించి ఉంటుందని టాక్. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తోన్న సాహి ఎంతో హుందాగా ఈ సెట్ లను ఏర్పాటు చేశాడని అంటున్నారు. సినిమాలో ఈ రెండు భవనాలు ఎంతో గొప్పగా కనిపిస్తాయని టాక్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది.