HomeTelugu Big Storiesశ్రీముఖి బిగ్‌బాస్‌కు అందుకే వచ్చిందట!

శ్రీముఖి బిగ్‌బాస్‌కు అందుకే వచ్చిందట!

2 21

తెలుగు ‘బిగ్‌బాస్‌3’ రియాల్టీ షో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో మొత్తం 15మంది సెలబ్రిటీలు ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లారు. ఓపెనింగ్‌ ఎపిసోడ్‌ను నాగ్‌ తనదైన చమక్కులు-చురుక్కులతో అలవోకగా నడిపించేశారు. ఇక 100 రోజులు ఇంకెంత ఆసక్తిగా నడిపిస్తారో చూడాలి. ఈ సందర్భంగా ప్రముఖ యాంకర్‌ శ్రీముఖిని నాగ్‌ ఒక ప్రశ్న అడిగారు. ‘పాపులర్‌ యాంకర్‌ అయిన నువ్వు వారంలో ఏడు రోజులూ బిజీగా ఉంటావు. అసలు తీరిక సమయమే ఉండదు. అవన్నీ వదిలి పెట్టి బిగ్‌బాస్‌ హౌస్‌కు ఎందుకు వచ్చావు?’ అని ప్రశ్నించారు. ‘బిగ్‌బాస్‌ కాన్సెప్ట్‌కు నేను పెద్ద అభిమానిని. ఇక్కడకు రావడం నాకెంతో ఇష్టం. అందుకే నాకున్న ఇతర కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి వచ్చేశా’ అని చెప్పుకొచ్చారు.

ఇక ఈ షోలో చివరిగా వచ్చిన హీరో వరుణ్‌ సందేశ్‌-వితిక జంటను నాగ్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఇద్దరూ సినిమా నటులు కావడంతో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు? ఈ సందర్భంగా వారి ప్రేమకథ గురించి చెప్పమన్నారు. ‘ఒక సినిమాలో హీరో హీరోయిన్లుగా చేశాం. అప్పుడే తొలిసారి వరుణ్‌ను కలిశా. మొదటి మూడు నెలలు అసలు మాట్లాడుకోలేదు. 22 సినిమాలు చేశాడు కదా! అందుకే నాతో మాట్లాడటానికి కాస్త యాటిట్యూడ్‌ చూపిస్తున్నాడనుకున్నా. చివరి షెడ్యూల్‌లో భాగంగా మలేషియా వెళ్లినప్పుడు తనంటే నాకు, నేనంటే తనకి ఇష్టమని తెలిసింది. ‘పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటేనే.. ముందుకు వెళ్దాం. పెళ్లి తర్వాత ప్రేమించుకుందాం’ అని నేనే చెప్పా. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇరు కుటుంబాల సభ్యులు ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకున్నాం’ అని వితిక చెప్పుకొచ్చారు. ‘అందరు కంటెస్టెంట్‌లు ఎలిమినేట్‌ అయిపోయి, ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో మీరిద్దరే మిగిలితే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?’ అని నాగ్‌ ప్రశ్నించగా, ‘అదే జరిగితే వరుణ్‌ను పక్కన పెట్టేసి నేనే గెలవాలనుకుంటా’ అని వితిక సమాధానం ఇవ్వగా, అందుకు వరుణ్‌ సమాధానం ఇస్తూ, ‘నేను కూడా అదే చేస్తా. అయితే కొన్ని విషయాల్లో తనే స్ట్రాంగ్‌గా ఉందనిపిస్తే గెలుపు అవకాశం తనకే ఇస్తా. ఎందుకంటే తను నా భార్య. ఆమె గెలిస్తే నేను గెలిచినట్లే’ అని చెప్పుకొచ్చారు వరుణ్‌. ఇక జంటగా వెళ్తున్న మీరు ఒంటరిగా ఆడాలని నాగ్‌ వారికి సూచించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu