HomeTelugu Trending'నా సామి రంగ' అంజిగాడు గ్లింప్స్‌ విడుదల

‘నా సామి రంగ’ అంజిగాడు గ్లింప్స్‌ విడుదల

Anji Intro Glimpse from Naa

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామి రంగ’. విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ సినమాలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. అల్లరి నరేశ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కు నెటిజన్ల నుండి మంచి స్పందన వస్తుంది. తాజాగా అల్లరి నరేశ్ పోషిస్తున్న అంజిగాడు పాత్రకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను షేర్ చేశారు.

అంజిగాడు వచ్చేహెడు ‘సూసారా సూసెయ్యండి సూసెయ్యండి.. లేదంటే మాటోచ్చేత్తాది’ అంటూ అల్లరి నరేశ్ స్టైల్‌లో సాగుతున్న డైలాగ్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి. చాలా కాలం తర్వాత ఈ కామెడీ హీరో పక్కా విలేజ్‌ అవతార్‌లో పసందైన వినోదాన్ని అందించబోతున్నట్టు గ్లింప్స్‌తో అర్థమవుతోంది. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి తెరకెక్కిస్తున్నారు. గూస్‌ బంప్స్‌ తెప్పించే యాక్షన్‌ ఎపిసోడ్‌తో నా సామి రంగ నయా స్టైల్‌తో ఉండబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రషెస్‌ చెబుతున్నాయి. పవన్‌ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్‌ బెజవాడ కథ అందిస్తున్నాడు. ఈ మూవీతో కొరియోగ్రాఫర్‌ విజయ్ బిన్ని డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu