HomeTelugu Trendingఅన్నపూరణి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అన్నపూరణి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

annapoorani movie release d

లేడి సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నపూరణి’. నీలేష్ కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా న‌య‌న్ 75వ సినిమా. ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుడ‌గా.. ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించి చిత్ర‌బృందం విడుద‌ల తేదీ ప్ర‌క‌టించింది.

ఈ సినిమాను డిసెంబ‌ర్ 01న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. దీనితో పాటు సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను వ‌దిలింది. ఈ పోస్టర్‌లో డైనింగ్ టేబుల్‌పై నాన్ వెజ్ ఫుడ్ ఉండ‌గా.. దాని ముందు న‌య‌న్ నిలుచుని ఉంది. ఈ సినిమాలో జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కెఎస్ రవికుమార్, సురేష్ చక్రవర్తి సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu