HomeTelugu Newsఓవర్‌సీస్‌లో దూకుడుమీదున్న ఎన్టీఆర్ 'అరవింద సమేత'!

ఓవర్‌సీస్‌లో దూకుడుమీదున్న ఎన్టీఆర్ ‘అరవింద సమేత’!

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సినిమా రేపు విడుదల కానుండగా ఈరోజు రాత్రి నుండే ఓవర్సీస్లో ప్రీమియర్ల షో వెయబడుతుంది. అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు చాలా మంది ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్ మూలంగానే యూఎస్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాలని సైతం వెనక్కి నెట్టి ‘అరవింద సమేత’ తన సత్తా చాటుతోంది.

11 3

ఇప్పటి వరకు 150 లొకేషన్ల నుండి 368,162 డాలర్లను రాబట్టిన ఈ సినిమా మొదటి రోజు మిలియన్ డాలర్ మార్కును ఈజీగా క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక హిట్ టాక్ వస్తే ఓవరాల్ వసూళ్లు కూడ ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఉత్తమమైన వసూళ్లుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజ హెగ్డే కథానాయకిగా నటించగా జగపతిబాబు ప్రతినాయకుడి పాత్ర పోషించారు. నాగబాబు తండ్రి పాత్రలో కనిపించనున్నారు. హీరో సునీల్‌ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu