HomeTelugu Trendingతెలుగు ప్రేక్షకుల ముందుకు 'ఏనుగు'గా వస్తున్న 'యానై'

తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఏనుగు’గా వస్తున్న ‘యానై’

Arun Vijay Enugu movie on J

కోలీవుడ్‌లో తనకంటూ.. ప్రత్యేకమైన గుర్తింపుని తెచుకున్నాడు సినియర్‌ నటుడు విజయ్‌ కుమార్‌ తనయుడు అరుణ్ విజయ్. ఈ యంగ్‌ హీరో తాజాగా నటించిన సినిమా ‘యానై’. ఈ సినిమా ఇప్పుడు ‘ఏనుగు’ పేరుతో టాలీవుడ్‌లో జూన్‌ 17న విడుదల కాబోతుంది. ఉత్తరాంధ్ర లో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసి, ధనుష్‌ ‘ధర్మయోగి’ తో నిర్మాతగా మారిన సీహెచ్‌ సతీష్‌ కుమార్‌.. విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాడు.

హీరో సూర్య తో సింగం సిరీస్ , విశాల్ తో పూజ వంటి యాక్షన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు హరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్,సముద్రఖని, కేజీయఫ్‌ ఫేమ్‌ రామచంద్రరాజు, రాధిక శరత్‌ కముఆర్‌, యోగిబాబు, అమ్ము తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu