HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌ నుంచి అషూ ఔట్

బిగ్‌బాస్‌ నుంచి అషూ ఔట్

10a 1
ఈ రోజు ఆదివారం(ఆగస్ట్‌ 25) బిగ్‌బాస్‌-3 తెలుగు 36వ ఎపిసోడ్‌లో నాగార్జున సందడి చేశారు.. ఇంటి కెప్టెన్‌ అయిన శివజ్యోతికి ఓ సరదా టాస్క్‌ ఇచ్చాడు. కొన్ని జంతువుల మాస్క్‌లు ఇచ్చి ఎవరికి ఏది వర్తిస్తుందో వారి గురించి చెప్పి వారికి ఆ మాస్క్ పెట్టాలని చెప్పాడు.. అలీ(సింహం), బాబా మాస్టర్‌(నక్క, ఊసరవెల్లి) మాస్క్‌లు ఇచ్చింది. మహేష్‌కి(నక్క), అషూ(పాము), శ్రీముఖి(కోతి), పునర్నవి(కుందేలు), వితిక(ఎలుగుబంటి).. రవి(కుక్క).. రాహుల్‌(జింక).. వరుణ్‌(తాబేలు).. హిమజ(ఏనుగు) మాస్క్‌లు ఇచ్చింది. తర్వాత మరో గేమ్‌ ఇచ్చాడు. 12 మందిని ఆరు జంటలుగా విభజించాడు. ఈ గేమ్‌ పేరు నువ్వే నేను.. బాబా-అషూ, హిమజ-రవి, శ్రీముఖి- రాహుల్‌, శివజ్యోతి-మహేష్, పునర్నవి-వరుణ్‌, ఈ జంటలు ఒకరు మరొకరిలా ప్రవర్తించి, వారిలా నటించాలి. వారు ఒకరి గురించి ఒకరు ఇమిటేట్‌ చేయాలి అని జంటలకు చెప్పాడు. వారు తమ నటనతో ఒకరి గురించి ఒకరు నటించి చూపించారు.

ముందుగానే అనుకుంటున్నట్లుగా ఈ వారం అషూరెడ్డి ఎలిమినేట్‌ అయ్యింది. ఈవారం ఎలిమినేషన్‌లో ఏడుగురు.. రాహుల్, హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌‌‌లు ఉండగా.. నిన్నటి ఎపిసోడ్‌లో శివజ్యోతి, మహేష్ సేఫ్ జోన్‌లోకి వెళ్లారు. హౌస్‌లో నుంచి బయటికి వస్తూ జిగేలు రాణి పాటకు అషు స్టెప్పులేసింది. స్టేజ్‌ మీదకు వచ్చిన అషూరెడ్డిని నాగార్జున హౌస్‌లో ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నాడు. అనంతరం ఆమె జర్నీ చూపించాడు. మన టీవీ ద్వారా ఇంటి సభ్యులను చూపించాడు.. అషూకి గేమ్‌ ఇచ్చాడు.. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి ఫొటోలు ఉన్న టైల్స్‌ను అషూ ముందుంచాడు. ఇంట్లో ఉండేందుకు ఎవరికి అర్హత ఉందనుకుంటున్నావో వారికి ఉంచి.. ఎవరికి అర్హత లేదనుకుంటున్నావో వారి ఫొటో ఉన్న టైల్స్ పగలగొట్టాలని అన్నాడు. మహేష్, రాహుల్, వితికా షెరు, హిమజ ఇంట్లో ఉండకూడదని వారి ఫొటోలను అషు పగలగొట్టింది. శివజ్యోతి, శ్రీముఖి, పునర్నవి, బాబా భాస్కర్, అలీ రెజా, రవికృష్ణ, వరుణ్ సందేశ్‌లు ఇంట్లో ఉండాలని తన అభిప్రాయాన్ని చెప్పింది. శ్రీముఖి స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌.. తను ఇంట్లో ఉండాలి అని చెప్పింది. పునర్నవి ఇంట్లో ఉండాలి తనకి డామినేషన్‌ ఎక్కువ అంది. ఇక ఈ ఎపిసోడ్‌కి గుడ్‌బాయ్‌ చెప్పి నాగ్‌ షోని ముగించాడు.. రేపు సోమవారం ఎలిమినేషన్‌ సందడి నెలకొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu