HomeTelugu Trendingసంక్రాంతి ముగ్గు వేస్తుండగా యువతి కిడ్నాప్‌కు యత్నం

సంక్రాంతి ముగ్గు వేస్తుండగా యువతి కిడ్నాప్‌కు యత్నం

3 15తెల్లవారుజామున ఇంటి ముంగిట సంక్రాంతి ముగ్గులు వేస్తున్న సమయంలో యువతిని ఇద్దరు యువకులు అపహరించేందుకు ప్రయత్నించారు. గుంటూరు జిల్లా బాపట్లలోని కోళ్లమూడివారి వీధిలో యువతి అపహరణకు దుండగులు యత్నించారు. అయితే యువతి సోదరి కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. పారిపోతున్న దుండగులను వెంబడించారు. యువకుల్లో ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

పండగ సమయంలో ఇలాంటి ఘటన జరగడం ఆ కుటంబసభ్యులకు ఎంతో ఆవేదన మిగిల్చింది. యువతిని అపహరించే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పారిపోయిన మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu