HomeTelugu Big Storiesహైదరాబాద్ లో 'అవతార్‌- 2'ని వీక్షించేందుకు 3డి గ్లాసెస్..

హైదరాబాద్ లో ‘అవతార్‌- 2’ని వీక్షించేందుకు 3డి గ్లాసెస్..

Avatar special attraction
దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో చూస్తున్న చిత్రం ‘అవతార్‌- 2’. ఈ సినిమా డిసెంబర్ 16న గ్రాండ్‌గా విడుదలకు రెడీ అవుతోంది. కాగా ‘అవతార్ 2’ భారీ స్క్రీన్ స్క్రీనింగ్ లో వీక్షకులకు ప్రత్యేక 3డి గ్లాసెస్ ఇవ్వనున్నట్లు హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ పెద్ద స్క్రీన్ వర్గాలు ప్రకటించాయి. ఇవి ప్రత్యేకంగా రూపొందించిన డాల్బీ విజన్ 3డి గ్లాసెస్ అని తెలిసింది. సినిమా వీక్షణ అనుభవాన్ని మహదాద్భుతంగా పెంచే ఖ్యాతి ఈ గ్లాసెస్ కి ఉంది. కాబట్టి ఈ ప్రత్యేక సౌకర్యం సినీ ప్రేమికులను మరింత ఉత్కంఠగా వేచి చూసేలా చేస్తోంది.

హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ జేమ్స్‌ కామెరాన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై సృష్టించిన అద్బుత రంగుల ప్రపంచాన్ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే విడుదలైన ‘అవతార్‌ 2’ ట్రైలర్‌కు అద్బుతమైన స్పందన వస్తోంది. ఈ సినిమా పై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ ట్వీట్ కూడా చేశాడు.

ఎపిక్‌ సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌ లో వస్తున్న ఈ చిత్రాన్ని లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రధాన భారతీయ భాషలన్నింటిలో విడుదల కానుంది. పండోరలో జేక్, అతని ఫ్యామిలీని మట్టుకరిపించేందుకు ముప్పు ముంచుకొస్తుంది. ఆ ముప్పు జేక్‌ సల్లీ టీం తమ కుటుంబాన్ని, భూగోళాన్ని నాశనం చేయకుండా ఎలా అడ్డుకున్నారన్నది సీక్వెల్‌లో తెలియనుంది. అవతార్‌ -2లో కేట్‌ విన్స్‌లెట్‌ ప్రధాన పాత్రలో నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu