బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌కు బంపర్ ఆఫర్స్‌..!

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్-2 సీజన్ ఈ వారంతో ముగియనుంది. 16 మంది సభ్యులతో ప్రారంభమైన బిగ్ బాస్-2 ఎన్నో మలుపులు తిరిగి దిగ్విజయంగా 107 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. ఇక 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా బిగ్‌బాస్-2 విన్నర్ ఎవరనేదానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా వుంటే బిగ్‌బాస్‌ హౌస్‌లో సభ్యులుగా వచ్చిన ఇద్దరు ముద్దు గుమ్మలు త్వరలో బుల్లితెరపై సందడి చేయబోతున్నారు.

ఇప్పటికే ఈటీవీ లో ప్రసారమవుతున్న ‘ఢీ 10 ‘ షో కి హోస్ట్ గా భానుశ్రీ వ్యవహరిస్తోంది. మా టీవిలో బ్రహ్మానందం మొదటి సారిగా ఓ కామెడీ షో చేయబోతున్న విషయం తెలిసిందే.. ఇందులో తేజస్వి హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ బిగ్‌బాస్‌ హౌస్‌లో చేసిన హంగామా మనకు తెలిసిందే.

తేజస్వి తన అందాలతో బిగ్‌బాస్‌ హౌస్‌లో అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బుల్లితెరపై హోస్ట్‌గా మరోసారి ప్రేక్షకులను, అభిమానులను అలరించబోతుంది. బిగ్‌బాస్‌ షోలోని కంటెస్టెంట్స్ బయటకు వచ్చి అవకాశాలను దక్కించుకుంటున్నారు. మరోవైపు కౌశల్‌కు ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించే అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.