HomeTelugu NewsDevara: ఆయుధ పూజ సాంగ్‌కి పూనకాలు పక్క అంటున్న టీమ్‌!

Devara: ఆయుధ పూజ సాంగ్‌కి పూనకాలు పక్క అంటున్న టీమ్‌!

 

Devara Movie Update 2

Devara: పాన్‌ ఇండియా హీరో ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర‌’ పార్ట్‌1. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. కాగా ఏప్రియల్‌లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది.

‘అక్టోబర్ 10’న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సైఫ్ అలీఖాన్ కి గాయం కారణంగా ఈ సినిమా క్లైమాక్స్ షూట్ ను పోస్ట్ ఫోన్ చేశారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ క్లైమాక్స్ షూట్ కి సన్నాహాలు చేసుకుంటోంది. త్వరలో సైఫ్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. అయితే సినిమాకి మరో పెండింగ్ వర్క్ కూడా ఉందట. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పాటలను కంప్లీట్ గా కంపోజ్ చేసి ఇవ్వక పోవడం కూడా ఒక కారణం అని అంటున్నారు. ఇటీవలే అనిరుద్‌ పాటలను సకాలంలో కంపోజ్‌ చేసి ఇవ్వడం లేదు అనే వార్తలు హాల్ఛల్ చేస్తున్నాయి.

తాజాగా ఈసినిమా కోసం అనిరుద్ ఒక అద్బుతమైన పాటని ఇవ్వడంతో యూనిట్ మొత్తం ఫుల్ ఖుషి అయ్యారని తెలుస్తుంది. ఈ సినిమాలో ఆయుధాలకు పూజ చేసే ఒక సీన్ ఉంటుందని. ఆ సీన్ కి తగ్గట్లు ఒక అద్బుతమైన సాంగ్ అవసరం ఉండగా అనిరుద్ అందరి అంచనాలను మించేలా ఒక సాంగ్ ను ఇచ్చారని అంటున్నారు. ఆ సాంగ్ తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించేలా వచ్చిందని అంటున్నారు. థియేటర్స్ లో ఈ సాంగ్ కి పూనకాలు పక్క అని టాక్‌.

 

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu