
జీవో నంబర్ -1పై తగ్గేదే లే.. ఇది మన ఆంబోతుల అదేనండి అంబటి రాంబాబు వారు రంకె వేసి మరీ చెబుతున్నారు. సార్ అంటే అంతే మరీ.. ఆయనకు అన్నీ చేయాలి. సగం సగం చేస్తే కుదరదు. ఇదే దోరణి జీవో నంబర్ -1 లో కూడా ఉంటుందని మన ఆంబోతుల బాబు వారు సెలవిచ్చారు. ఇప్పటికే ఈ జీవో పై ఏపీలో రాజకీయ దుమారమే రగులుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ చంద్రబాబును తిరగనివ్వకుండా చేసేందుకే జగన్ సర్కార్ ఈ జీవో తీసుకొచ్చింది. చంద్రబాబు ప్రస్తుతం ఆంక్షల నడుమే కుప్పం పర్యటనలో వున్నారు. ప్రజలు ఆయన కోసం తరలివెళ్తున్నారు. ప్రజల వద్దకు బాబు అనేది పోయి.. ఇప్పుడు బాబు వద్దకు ప్రజలు అనే నినాదం ఎగసేలా ఉంది.
ఇదే విషయాన్ని మన ఆంబోతుల వారు కూడా వాసన పీల్చారు. ఈ నేపథ్యంలో జీవోపై ఆంబోతుల వారు మరోసారి ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. జీవో నంబర్-1ను ఉపసంహరించే ప్రశ్నే లేదని తేల్చేశారు. రేపు ప్రజలు కూడా వీరి సంగతేంటో తేల్చేస్తారు లేండి. ఇలాంటి జీవోలను కనిపెట్టిన బ్రిటిష్ వాళ్ళనే ప్రజలు తరిమి కొట్టారు. ఎప్పుడో చరిత్రలో జరిగిన ఈ సంఘటన, తమ భవిష్యత్తు కోసం ప్రజలు నేడో రేపో ఎందుకు చేయరు ?, కచ్చితంగా తమ పిల్లల భవిష్యత్తు కోసమైనా ప్రజల్లో మార్పు వస్తోంది. ఎందుకంటే.. ఇప్పటికే వాస్తవ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
అయినా, అది ఏ పార్టీ వారైనా సరే.. తమ కొడుకు నెలకు లక్షల్లో సంపాదించే సాప్ట్ వేర్ ఉద్యోగం చేయాలి అనుకుంటారా ?, లేక, నెలకు 7 వేలు తీసుకునే వాలంటీర్ అవ్వాలని అనుకుంటారా ?, కనీస బుద్ది జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి కూడా తన వారసుడు వాలంటీర్ అవ్వాలని అనుకోడు. అనుకోకూడదు కూడా. కానీ, ప్రజలను తప్పు దారి పట్టించే విధంగా కొన్ని పిచ్చి కుక్కలు పై విధంగా మాట్లాడుతూ ఉంటాయి. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ జనం పిట్టల్లా రాలిపోతున్నారని పిచ్చిగా వాపోతాయి. కానీ సదరు కుక్కలకు ఏం తెలుసు ?, ప్రజల ప్రాణాల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని. మళ్లీ అలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సింది కూడా ప్రభుత్వమే. ఇది వదిలేసి.. ఆంబోతుల వారు ఏవేవో కూస్తున్నారు. ఎంత అవివేకం !!.













