HomeTelugu Trending'బేబి' 8 రోజుల్లో 54 కోట్లు వసూల్‌!

‘బేబి’ 8 రోజుల్లో 54 కోట్లు వసూల్‌!

Baby crosses 50 crores gross Trade in shock
చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం ‘బేబి’. ఈ సినిమాకి ఒక రేంజ్ లో యూత్ కనెక్ట్ అయ్యారు. ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య- విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, రెండోవారంలోను తన జోరు చూపిస్తూ ఉండటం విశేషం.

ఈ సినిమా 50 కోట్ల మార్కును దాటేసింది. నిన్నటితో 8 రోజులను పూర్తి చేసుకున్న ఈ సినిమా, 54 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఒక చిన్న సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషంగా చెబుతున్నారు. నిజానికి నిన్న కాస్త క్రేజ్ ఉన్న సినిమాలు ఓ మూడు వరకూ రిలీజ్ అయ్యాయి.

దీని వల్ల ‘బేబి’ వసూళ్లపై ఎంతో కొంత ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందనుకున్నారు. కానీ నిన్న విడుదలైన కొత్త సినిమాల ఎఫెక్ట్ కూడా ఈ సినిమా వసూళ్లపై ఎంత మాత్రం పడలేదు. ఈ సినిమా వలన కొత్త సినిమాల షోలు కూడా కొన్ని చోట్ల కేన్సిల్ కావడం విశేషం.

20230722fr64bb737521488

Recent Articles English

Gallery

Recent Articles Telugu