HomeTelugu Trendingస్కంద ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌కు అతిథిగా బాలకృష్ణ

స్కంద ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌కు అతిథిగా బాలకృష్ణ

Balakrishna as guest at Ska
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో స్కంద మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.

స్కంద మూవీకి సంబంధించి ప్రమోషన్స్ కూడా ఆ స్థాయిలోనే చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ శిల్పకళా వేదికలో భారీగా ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ రాబోతున్నారు. ఈ విష‌యాన్ని ప్రకటిస్తూ మేకర్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ కార్యక్రమంలోనే స్కంద ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఒక చిన్న గ్లింప్స్ మూవీపై ఓ రేంజ్ బజ్‌ని క్రియేట్ చేసిన రామ్ అండ్ బోయపాటి ట్రైలర్‌తో ఎటువంటి హైప్ క్రియేట్ చేస్తారో చూడాలి. సెప్టెంబర్ 15న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ, భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu