HomeTelugu Trending'వీరసింహా రెడ్డి' సెకండ్‌ సింగిల్‌ అప్డేట్‌

‘వీరసింహా రెడ్డి’ సెకండ్‌ సింగిల్‌ అప్డేట్‌

Veera simha reddy movie upd

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వీరసింహా రెడ్డి’. మైత్రీ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఫస్టు లుక్ తోనే ఆసక్తిని కలిగించి .. అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ సెకండ్ సింగిల్ ను రిలీజ్ కి రెడీ చేస్తోంది. తమన్ స్వరపరిచిన పాటల్లో నుంచి ‘సుగుణ సుందరి’ అంటూ సాగే పాటను, ఈ నెల 15వ తేదీన ఉదయం 9:42 నిమిషాలకు విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం విడుదల చేశారు.

పవర్ఫుల్ పాత్రలో .. డిఫరెంట్ లుక్ తో బాలయ్య ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాలో శృతి హీరోయిన్‌గా అలరించనుంది. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu