HomeTelugu Big Storiesహిట్ కాంబో రిపీట్ ..బాలయ్య,బోయపాటి మ‌రో చిత్రం

హిట్ కాంబో రిపీట్ ..బాలయ్య,బోయపాటి మ‌రో చిత్రం

Balayya Boyapati Again Team Up For Next Project

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేష్‌లో నాలుగో చిత్రానికి సన్నాహాలు మొదలయ్యాయా..! ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇదే టాక్ వినిపిస్తోంది. బాలయ్య – బోయపాటిలది హిట్ కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..వీరిద్దరి కాంబో లో గత ఏడాది లో విడదల అయినా అఖండ ఏపీలో టికెట్ సమస్యలున్నా కూడాభారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్నీ చోట్లా అఖండ వసూళ్ల పరంగా ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది…

ఆ సమయంలోనే ఈ చిత్ర నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి.. బాలయ్య – బోయపాటి కాంబినేషన్‌లో మరో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని ప్రకటించాడు. అయితే, ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో కొత్త ప్రాజెక్ట్‌ను మాత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రూల్స్ ప్లస్ వారు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత సెట్స్ మీదకు తీసుకువచ్చేందుకు బోయపాటి – బాలయ్యలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు బాలయ్య.. గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu