
Virender Sehwag networth:
ఇంటర్నెట్‌లో విరహమే హాట్ టాపిక్. క్రికెట్ దిగ్గజం విరేందర్ సెహ్వాగ్ 20 సంవత్సరాల తరువాత తన భార్య ఆర్టీ అహ్లావత్ నుంచి విడిపోతున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. వీరు సోషల్ మీడియాలో ఒకరికొకరు అన్‌ఫాలో చేయడం, విడిగా జీవించడం ఇలాంటి వార్తలకు మరింత బలం చేకూర్చాయి. అయితే, వీరు దీనిపై అధికారికంగా స్పందించలేదు.
విరేంద్ర సెహ్వాగ్ ఆర్థిక విజయానికి క్రికెట్ ముఖ్యమైన కారణం. 2024 నాటికి ఆయన నికర సంపద రూ. 350 కోట్లు. బీసీసీఐ, ఐపీఎల్ కాంట్రాక్టులు ఆయన సంపదకు పెద్ద మద్దతుగా నిలిచాయి.
సెహ్వాగ్ బ్రాండ్లలో కూడా పెద్ద పేరు. అడిడాస్, శాంసంగ్, రీబాక్, బూస్ట్, హీరో హోండా వంటి బ్రాండ్లతో పని చేయడం ద్వారా ఆయన మంచి ఆదాయం సంపాదించారు.
క్రికెట్‌కు రిటైర్ అయిన తర్వాత, సెహ్వాగ్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికలపై చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. 2024లో, ఆయన రూ. 30 కోట్లు సంపాదించారు. అందులో రూ. 24 కోట్లు సోషల్ మీడియా ప్రమోషన్ల నుంచే వచ్చాయి.
హరియాణాలో 23 ఎకరాల విస్తీర్ణంలో సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించారు. ఆట, విద్య కలిపి యువ ప్రతిభను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉంది.
ఢిల్లీ హౌజ్ ఖాస్‌లో ఆయన రూ. 130 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లులో నివసిస్తున్నారు. వ్యక్తిగత జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. బెంట్లీ కాంటినెంటల్ ఫ్లైయింగ్ స్పర్, బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ కార్లను వాడుతూ ఉంటారు.
ఇక ఆఖరిగా విరేందర్ సెహ్వాగ్ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లల విద్యకు సహాయం చేస్తున్నారు.
ALSO READ: Tollywood IT Raids వెనుక బాలివుడ్ మాఫియా హస్తం ఉందా?