HomeTelugu Big Storiesతాతలు, తండ్రులు ఉంటే సరిపోదు.. టాలెంట్‌ ఉండాలి బ్రదర్‌: బండ్ల గణేశ్‌

తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు.. టాలెంట్‌ ఉండాలి బ్రదర్‌: బండ్ల గణేశ్‌

Bandla ganesh Counter on Vi
టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన చిత్రం ‘లైగర్’‌. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. రౌడీ హీరో భారీ కటౌట్‌ పెట్టి దానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసి నానా రచ్చ చేశారు. అటు సోషల్‌ మీడియానూ లైగర్‌ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతుంది. అభిమానుల హడావుడి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన విజయ్‌ మాస్‌ స్పీచ్‌ ఇచ్చాడు.

‘మీకు మా అయ్య తెల్వదు, మా తాత తెల్వదు, ఎవ్వడూ తెల్వదు. నా సినిమా రిలీజ్‌ అయ్యి రెండేళ్లు అయితుంది. రిలీజ్‌ అయిన సినిమా కూడా పెద్దగా చెప్పుకునే మూవీ కాదు. అయినా ట్రైలర్‌కు ఈ రచ్చ ఏందిరా నాయన..’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే విజయ్‌ టాలీవుడ్‌లో మెగా హీరోలను ఉద్దేశించే ఈ కామెంట్లు చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. తాజాగా బండ్ల గణేశ్‌ దీనికి కౌంటర్‌ ఇచ్చాడు. ‘తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు, టాలెంట్‌ కూడా ఉండాలి. ఎన్టీఆర్‌లా, మహేశ్‌బాబులా, రామ్‌చరణ్‌లా, ప్రభాస్‌లా.. గుర్తుపెట్టుకో బ్రదర్‌’ అని ట్వీట్‌ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!