చరిత్ర సృష్టించిన తెలుగు సినిమా.. ‘నాటునాటు’కు ఆస్కార్‌

యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 95వ ఆస్కార్‌ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్ వేదికగా జరిగే ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీతారలు చేరుకున్నారు. తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించింది.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటునాటు’ పాటకు అవార్డు ప్రకటించగానే థియేటర్ కేరింతలతో దద్దరిల్లిపోయింది. మరోవైపు, లైవ్‌లో చూస్తున్న తెలుగు సినీ అభిమానులు ఆనందంతో పులకరించిపోయారు. ఆస్కార్ అవార్డు అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ బృందం ఆనందంలో మునిగిపోయింది.

చంద్రబోస్ రచించిన ఈపాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. ప్రముఖ దర్శకుడ రాజమౌళి తెరక్కెకించిన ట్రిపుల్ ఆర్ సినిమా 24 మార్చి 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. ఈ పాటకు వారు చేసిన డ్యాన్స్‌కు ప్రపంచం మొత్తం ఫిదా అయింది.

తెలుగు సినిమా పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం, అవార్డు దక్కించుకోవడం ఇదే తొలిసారి. దీంతో తెలుగోడు గర్వంతో తలెత్తుకుంటున్నాడు. టాలీవుడ్‌లో పండగ వాతావరణం నెలకొంది. దర్శక దిగ్గజం రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, మూవీ యూనిట్‌కు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున్నశుభాకాంక్షలు చెబుతున్నారు.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates