HomeTelugu Trendingబెదురులంక2012: ట్రైలర్‌

బెదురులంక2012: ట్రైలర్‌

Bedurulanka 2012 movie Trai

టాలీవుడ్‌ హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బెదురులంక2012’. ఈ సినిమాకు క్లాక్స్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సరిగ్గా పదకొండేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన యుగాంతం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. బెదురలంక అనే ఊర్లో చోటు చేసుకున్న వింత పరిణామాలను తెరపై చూపించబోతున్నట్లు ఇప్పటికే టీజర్‌తో దర్శకుడు క్లాక్స్‌ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కాబోతుంది. క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.

యుగాంతం గురించి భయపడుతున్న బెదురలంక ప్రజలను కొందరు మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. వాటి నుంచి ప్రజలు తప్పించుకుంటారా? యుగాంతం వాళ్ల జీవితాలలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? అనే విధంగా సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా యుగాంతం చుట్టు జరిగిన పరిణామాలను క్లాక్స్ సర్కాస్టిక్‌గా, హ్యూమరస్‌గా చూపించబోతున్నట్లు ట్రైలర్‌తో స్పష్టమయింది.

ట్రైలర్‌ మొత్తం ఫన్నీగానే సాగింది. ముఖ్యంగా మణిశర్మ బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్‌ వేరే లెవల్లో ఉంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైపే ఉంది. లౌక్య ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై రవింద్ర బెనర్జీ ఈ సినిమాను నిర్మించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu